రంగ‌రంగ వైభవంగా మూవీ రివ్యూ

Published On: September 2, 2022   |   Posted By:
రంగ‌రంగ వైభవంగా మూవీ రివ్యూ
image.png

వైష్ణ‌వ్ తేజ్‘రంగ‌రంగ వైభవంగా’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)

👎

తన మెదటి  రెండు చిత్రాలకు భిన్నంగా ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగే ‘రంగ రంగ వైభవంగా’తో తిరిగి తాను సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ధీమాగా ఉన్నాడు వైష్ణవ్. ఈ చిత్రం అతడితో పాటు దర్శకుడు గిరీశయ్యకు, హీరోయిన్ కేతిక శర్మకు, నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌కు చాలా కీలకం. గిరీశయ్య తమిళంలో ‘ఆదిత్య వర్మ’తో హిట్ కొట్టినప్పటికీ అది ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కావడంతో ఫుల్ క్రెడిట్ అతడికి దక్కలేదు. ఇప్పుడు తన సొంత కథతో అతను తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఇలాంటి సిట్యువేషన్ లో థియేటర్ లోకి దిగిన ఈ చిత్రం ఏ మేరకు వారి అంచనాలను రీచ్ అయ్యింది..అసలు కథోంటో చూద్దాం…స్టోరీ లైన్

వైజాగ్ లో కథ నడుస్తుంది. అక్కడ రిషి (పంజా వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) చిననాటి స్నేహితులు. ఒకే రోజు ..ఒకే ఆస్పత్రిలో పుట్టారు. ఒకరి కోసమే ఒకరు అన్నట్లు బ్రతుకుతారమో అనుకుంటాము. అయితే వీళ్లెప్పుడూ కొట్టుకు ఛస్తూంటారు. వీళ్ల నాన్నలు(నరేష్, ప్రభు) ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రక్క ప్రక్క ఇళ్లల్లోనే ఉంటూంటారు  నువ్వే కావాలి కథ గుర్తుకు వస్తే అది మీ తప్పు కాదు. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో జరిగిన ఓ చిన్న సంఘటనతో వీరిద్దరూ విడిపోతారు. అక్కడ నుంచి వీరిద్దరూ ఎంత శత్రువులు అయ్యిపోతారంటే ఒకే మెడికల్ కాలేజీలో చేరినా మాట్లాడుకోరు. కానీ లోలోపల వారి ప్రేమ రోజు రోజుకీ పెరిగిపోతూంటుంది. ఇక ఇద్దరూ కలిసి మాట్లాడుకుని తమ ప్రేమను చెప్పేసున్న సమయానికి …. తమ కుటుంబాలు రెండు తగువులు పడి మాట్లాడటం మానేస్తాయి. అప్పుడు వీళ్లిద్దరూ ఎలా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నారు. తమ కుటుంబాలని కలిపి, తాము ఒకటి ఎలా అయ్యారనేది మిగతా కథ.

ఎనాలసిస్ …

పై కథ చదివాక మనకు అనిస్తుంది. ఇలాంటి కథతో ఎలా సినిమా తీసారు. ఇలాంటివి బోలెడు..చూసేసాం. పవన్ కళ్యాణ్ ఖుషీ, తరుణ్ నువ్వే కావాలి, నువ్వేలేక నేను లేను, నిన్నే పెళ్లాడతా వంటి చాలా సినిమాలు గుర్తు వస్తాయి. అయితే రొమాంటిక్ కామెడీల్లో కొత్తగా చెప్పేదేముంది..ఒకటే ఫార్మెట్ ఉంటుంది కదా అనుకుంటే ఒకటే సీన్స్ కనపడుతూంటాయి. అవి కూడా మరీ పాత సీన్స్ ఇప్పటి నటులతో చేయించినట్లు అర్దమైపోతుంది.  దానికి తోడు సినిమాలో ఎక్కడా ఇంట్రస్టెంగ్ పాయింట్ అనేది కనపడదు. ఎలాగూ వీళ్లద్దరూ కలుస్తారు..ఇందులో పెద్ద వింతేముంది అనిపిస్తుంది. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ తమ కుటుంబాలను కలిపే ప్రాసెస్ లో ఏదన్నా ఇబ్బందులు ఎదురై వాటిని వాళ్లు అధిగమించారు అనేది కొత్తగా చూపెడితే ఆసక్తిగా ఉండేది.  కానీ డైరక్టర్ అటు దిసగా ఆలోచించలేదు. ఎంతసేపు సీన్ తర్వాత సీన్ వేసుకుంటూ వెళ్లిపోయారు.  ముఖ్యంగా ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ గా నడిచిన పోయినా సెకండాఫ్ చాలా దారుణంగా ఉంటుంది. విసిగిస్తుంది. ఎక్కడా అద్బుతం అనిపించే ఒక్క మూవ్ మెంట్, సీన్ కనిపించదు. ఏదైమైనా ఇలాంటి కథ చేయాలంటే అది ఖషీ సినిమాని దాట గలగాలి. లేకపోతే ఊరుకోవటం అంత ఉత్తమం లేదు.

టెక్నికల్ గా…

ఈ సినిమాకు పైన చెప్పుకున్నట్లు స్క్రిప్టే పెద్ద సమస్యగా మారి చంపేసింది.  సెకండాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ పండించే దిశ‌గా సాగినా, పాత చింత‌కాయ ప‌చ్చ‌డి అనిపిస్తుంది. సినిమా కథలోనూ కొత్తదనం లేదు..స్క్రీన్ ప్లే లోనూ కొత్తదనం లేదు. ఉన్నంతలో దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం బాగుందనిపిస్తుంది.  “తెలుసా…తెలుసా…“, “కొత్త‌గా లేదేంటి…“  పాట‌లు రిలీఫ్ ఇస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ ..ఇంత నీరసమైన సినిమాని ఇంక లేపలేను అన్నట్లు చేతులెత్తేసింది.

నటీనటుల్లో ..

వైష్ణవ్ తేజ్ ఉన్నంతలో బాగానే చేసాడు.  ఉషారైన పాత్రే. కానీ సినిమాలో దమ్ము లేకపోవటంతో చాలా చోట్ల తేలిపోయాడు.  డాన్స్ లు కూడా మెరగు అవ్వాలి.తన మామయ్య   పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేస్తే బాగుండనే విషయం తెలుసుకోవాలి.  కేతిక శర్మ చూడ్డానికి బాగుంది కానీ ..నటన ఏమీ లేదు.  నరేష్, ప్రభు కారెక్టర్స్ కొత్తవేం కాదు..వాళ్లు మాత్రమే చేయదగ్గవి కాదు.   అలీ, నవీన్ చంద్ర,నాగబాబు,సుబ్బరాజు లకు ప్రత్యేకమైన క్యారక్టరైజేషన్ ఏమీ లేదు.

నచ్చినవి

లీడ్ పెయిర్ రొమాంటిక్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్

నచ్చనవి

కథలో కొత్తదనం లేకపోవటం
నీరసమైన డైరక్షన్
పండని కామెడీ

చూడచ్చా?

చూడటానికి కొత్తగా ఏమీ లేదు… పాతసారానే  కొత్త బాటిల్ లో అందించారు

తెర ముందు..వెనక:

నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేశ్, ప్రభు, ప్రగతి, తులసి, సుబ్బరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, ‘స్వామి రారా’ సత్య, ‘ఫిష్’  వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: బాపినీడు బి
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గిరీశాయ
Run Time:2 hr 23 mins
విడుదల తేదీ: సెప్టెంబర్ 2, 2022