హ్యాపీ బర్త్ డే చిత్రం రివ్యూ

Published On: July 8, 2022   |   Posted By:

హ్యాపీ బర్త్ డే చిత్రం రివ్యూ

పార్టీకి పిలిచి… :  హ్యాపీ బర్త్ డే రివ్యూ

Emotional Engagement Emoji

👎

తెలుగులో Surreal humourలో ఓ కొత్త చిత్రం వస్తోందంటే అందరిలో అంటే చెప్పలేం కానీ సినీ లవర్స్ లో మాత్రం ఖచ్చితంగా క్యూరియాసిటీ ఉంటుంది. ఈ జానర్ లో ఇప్పటిదాకా సినిమా రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో వెరైటీ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తారు. మరి ఈ ప్రత్యేకత ఈ సినిమాలో ఏముంది సినిమా సగటు ప్రేక్షకుడుని ఆకట్టుకునేలా ఉందా…అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

గన్ లైసెన్స్‌లు లీగలైజ్ చేస్తాడు రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) దాంతో అందరూ గన్ లు పొలోమంటూ కొనుక్కుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే  హ్యాపీ (లావణ్య త్రిపాఠి) తన పుట్టిన రోజు పార్టీ కోసమని రిట్జ్ హోటల్ కు వెళ్తుంది. కానీ అక్కడ విసుగ్గా పార్టీ సాగటంతో ప్రక్కనే ఉన్న పబ్ లోకి వెళ్తుంది. అక్కడ  కొన్ని ఊహించని పరిణామాల మధ్య ఆమె పర్సులోకి ఒక లైటర్ వచ్చి చేరుతుంది. దాని కోసం లక్కీ (నరేష్ అగస్త్య) అనే వెయిటర్ ఆమె వెంట పడుతూంటాడు. మరో పక్క అదే హోటల్ కు రిత్విక్ కూడా వస్తాడు. అతడితో పాటు మ్యాక్స్ పెయిన్ (సత్య) ఇంకా కొందరు ఆమెను టార్గెట్ చేస్తూంటారు ఇంతకీ ఆ లైటర్లో ఏముంది అసలు హ్యాపి వెంట అందరూ ఎందుకు పడుతున్నారు  ఫైనల్ గా ఈ కథలో ఉన్న మెయిన్ ట్విస్ట్ ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

కొన్ని వింటానికి బాగుంటాయి, మరికొన్ని చదవటానికి బాగుంటాయి, కొన్ని మాత్రమే చూడటానికి బాగుంటాయి. అలా స్టోరీలైన్ గా ఎగ్జైటింగ్ అనిపించే పాయింటే   హ్యాపీ బర్త్ డే లో ఉంది. దేశంలో గన్స్ కు లైసన్స్ వచ్చి అందరికీ గన్స్ ఇస్తే భలే క్రేజీ థాట్ లా అనిపిస్తుంది. కానీ సినిమాగా చూడటానికి వచ్చేసరికి అంత సీన్ లేదనిపిస్తుంది. అందుకు కారణం హాఫ్ బేకెడ్ గా తయారైన స్క్రిప్టు, బాలెన్స్ గా లేని సీన్స్ కారణం. ఇవి సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లకుండా వెనక్కి నడిపించాయి. క్రేజీ ఐడియా సినిమాలో కాసేపు మాత్రమే ఎంగేజ్ చేస్తుందనే విషయం దర్శకుడు మర్చిపోయి మిగతా సీన్స్ దాని చుట్టూనే అల్లారు. దాంతో ఈ సినిమా షార్ట్ ఫిలమ్ కు ఎక్కువ సినిమాకు తక్కువ అనిపిస్తుంది. పోనీ ఐడియా విస్తరణ అంతలా జరగనప్పుడు దాన్ని సబ్ ప్లాట్ లతో పండించటానికి చూస్తారు. ఇక్కడా అదే ప్రయత్నం చేసారు కానీ ఆ స్టోరీ లైన్ కు తగ్గ సబ్ ప్లాట్స్ కథలో సెట్ కాలేదు. దాంతో అవన్నీ తేలిపోయాయి. కేవలం క్యారక్టర్స్ మాత్రమే మిగిలాయి. వాటి మధ్య నుంచి వచ్చే ఫన్ అక్కడిక్కడ ఎంగేజ్ చేసింది కానీ ఎగ్జైజ్ చేయలేకపోయింది. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో మెయిన్ క్యారక్టర్ కు ట్విస్ట్ పెట్టుకున్నారు. ఫన్ లో ఎప్పుడూ ట్విస్ట్ ఓపెన్ చేస్తే నే మజా. ఆ విషయంలో దర్శకుడు సస్పెన్స్ పాటించాడు. క్లైమాక్స్ దాకా భరించమన్నాడు దాంతో సినిమా ఫస్టాఫ్ ఎలాగోలా పాసైపోయినా సెకండాఫ్ కు వచ్చేసరికి బోర్ కొట్టేసింది. క్రేజీ ప్రమోషన్స్ ఉన్నంతగా సినిమా క్రేజీగా లేదు. ఏదో ఎక్సపెక్ట్ చేసుకుని పార్టీకు వెళ్తే ఏదోదో అయ్యిపోయింది. బోర్ పార్టీగా విసుగెత్తించింది. ఏదైమైనా సర్రియల్ కామెడీ అంటూ లాజిక్స్ వెతకొద్దు సినిమాలో చూపించే ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవద్దు అంటూ ముందే డిస్క్లైమర్ కూడా వేసేయడంతో సరిపెట్టుకుంటాం. కానీ కొద్దిపాటి కామెడీ సీన్లు మినహాయిస్తే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో  హ్యాపీ బర్త్ డే కష్టమయ్యింది. అలాగే  లైటర్ కు సంబంధించిన సీక్రెట్ ఏంటా అని చివర్లో చూస్తే అదీ తేలిపోయింది.  ఫస్టాఫ్ లో  లావణ్య, అగస్త్య, సత్యలను పరిచయం చేస్తూ వారి కోణంలో వెరైటీ స్క్రీన్ ప్లేతో కథను చెబుతూ కాస్త ఎంగేజింగ్ గానే సినిమాను నడిపించాడు రితేష్. సెటైరికల్, పేరడీ టచ్ తో సాగే కామెడీ సీన్లు కొంత నవ్వించినా హ్యాపీ బర్త్ డే ఫైనల్ మంచి ట్రీట్ ఇవ్వలేకపోయింది.

టెక్నికల్ గా

దర్శకుడుగా రితేష్ రానా రొటీన్ గా వెళ్లకుండా కొత్తగా ప్రయత్నించారనే చెప్పాలి. ద‌ర్శ‌కుడిలో కామెడీ టింజ్ ఉంది. సెటైర్లు వేయ‌గ‌ల నేర్పు ఉన్నా లిమిట్ దాటి అతి చేసారనే చెప్పాలి. కాస్త కంట్రోలులో ఉండి ఉంటే మరో క్లాసిక్ అయ్యేది. డైరక్టర్ గా అన్ని విభాగాల నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. టెక్నికల్ గా నూ మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. సినిమా అంతా ఒకే లొకేష‌న్‌లో చుట్టేయాలి అనే ఐడియానే విసిగిస్తుంది. కాలభైరవ  పాటలు సరిగ్గా ఇవ్వలేదు కానీ డైరక్టర్ టేస్ట్ కు  తగ్గట్లు డిఫరెండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎడిటింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం నీట్ గా ఉంది. అలాగే  సినిమాలో ఆర్ట్ వర్క్ మాత్రం అద్బుతంగా ఉంది. వాళ్లదే కష్టం. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే చిన్న సినిమా అని తేలిపోయింది.

నటీనటుల్లో

లావణ్య త్రిపాఠి వైవిధ్యమైన పాత్రే. క్రేజీగా ఫన్నీగా సాగే పాత్రలో లావణ్యను చూపెట్టడటం ప్రేక్షకులకు  కొత్తే . ఈ సినిమాలో  సత్య హిలేరియస్ గా నవ్వించాడు. తనకే సొంతమైన టిపికల్ కామెడీ టైమింగ్ తో అతను అదరగొట్టాడు. వెన్నెల కిషోర్ ప్రారంభంలో ఇచ్చే ఇంటర్వూ, కొన్ని సీన్స్ బాగున్నాయి.

చూడచ్చా

విడివిడిగా ముక్కలు ముక్కలుగా బాగున్న ఈ సినిమా ఓటిటికి ఫెరఫెక్ట్ ఆప్షన్

నటీనటులు: లావణ్యా త్రిపాఠీ, నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
సంగీతం: కాల భైరవ
సమర్పణ: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రితేష్ రానా
Run Time: 2h 34m
విడుదల తేదీ: జూలై 8, 2022