అనకాపల్లి మూవీ సాంగ్ విడుదల
సోనూ సూద్ చేతుల మీదుగా ‘అనకాపల్లి’ మూవీ నుంచి లిరికల్ సాంగ్
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజాగా ఓ మాసీ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను రియల్ హీరో సోనూ సూద్ విడుదల చేశారు. ‘డర్టీ గ్యాంగ్ స్టర్స్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే సినిమా ఎంత రా అండ్ రస్టిక్‌గా ఉంటుందో అర్థం అవుతోంది. ఇక ఈ పాటను విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు సోనూ సూద్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘డర్టీ గ్యాంగ్ స్టర్స్’ అంటూ సాగే ఈ పాటను కేకే రచించగా.. పృథ్వీ చంద్ర, ఈకే ఆలపించారు. దేవ్‌జండ్ బాణీ ఎంతో ఇంటెన్స్‌తో ఉంది. ఈ పాట వింటుంటే ఓ అడ్రినల్ రష్‌లా అనిపిస్తోంది. మాస్ ఆడియెన్స్‌కి ఈ పాట ఇన్ స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని ఆగస్ట్ 7న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.
*తారాగణం* : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు
*సాంకేతిక సిబ్బంది:*
బ్యానర్: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్
నిర్మాతలు: కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన
సహ నిర్మాత: కాండ్రేగుల కుమార్ రాజా
కథ & స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన
దర్శకుడు: ఖగేష్ తమ్మినేని
డీ ఓ పి : మాయా. వి
సంగీతం: దేవ్ జండ్
ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి
పీ అర్ ఓ : సాయి సతీష్