బెంగుళూరు మహానగరం లో బాలక మూవీ నిఖిల్ థామస్ లుక్ విడుదల
 

నివేదా థామస్ తమ్ముడు హీరోగా " బెంగుళూరు మహానగరం లో బాలక" మూవీ 
 
మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్  సంయుక్తంగా, మహి - రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్, కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు.

తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

నివేదా థామస్  తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న
ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు.

ఈ చిత్రంలో Raghu Karumanchi ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, ఆయనతో పాటు Chitram Srinu కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నటులు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ధనరాజ్ వినీత్, మహేంద్ర, అచ్యుత్ కూడా ఈ చిత్రంలో  నటిస్తున్నారు.


ఈ చిత్రానికి 
నిర్మాతలు – C.H.V శర్మ, MSN మూర్తి 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -మేరీ జెన్నిఫర్ 
దర్శకత్వం – మహి, రాజశేఖర్
కథ: మహి
సినిమాటోగ్రాఫర్ – మల్లూ నాయక్
సంగీతం – విశ్వదీప్
ఏడిటర్ - హర్షిత్ కొటా
కాస్ట్యూంస్ - ప్రణతి
పబ్లిసిటి - చిన్మయి
PRO - వీర బాబు