ధర్మస్థల నియోజకవర్గం సినిమా సక్సెస్ మీట్
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం..నిన్న (సెప్టెంబర్ 4న) వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ మాట్లాడుతూ - మా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సినిమాకు అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించినదాని కంటే పెద్ద విజయాన్ని అందించారు. ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించిన మా డైరెక్టర్ గారికి, ఇతర టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ - మా సినిమా చూసిన వాళ్లంతా ఒక మంచి మూవీ చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ఈ రోజు సమాజంలో జరుగుతున్న ఘటనలను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించాను. మన సమాజంలోని వారు, మన ఇంటిలోని వారు ఈ మూవీలోని క్యారెక్టర్స్ తో పోల్చుకునేలా ఉంటారు. రిలీజైన ప్రతి థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీ మూవీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లండి అంటూ చెబుతున్నారు. మా సినిమా మీకు నచ్చితే మరో పదిమందికి చెప్పండి, మీతో పాటు మీ పిల్లల్ని కూడా సినిమాకు తీసుకెళ్లండి. అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ - ధర్మస్థల నియోజకవర్గం లాంటి మంచి చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ, మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు ఫిల్లర్స్ లా నిలబడ్డారు. చంద్రబోస్ గారు గొప్ప సాహిత్యాన్ని అందించారు. మహవీర్ తన పేరులో ఉన్నంత పవర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా కోస్టార్స్ అందరికీ థ్యాంక్స్. ఒక కామన్ మ్యాన్ కోసం కామన్ మ్యాన్ కథతో కామన్ మ్యాన్ రూపొందించిన సినిమా ఇది. అన్నారు.
నటుడు శివకుమార్ మాట్లాడుతూ - మా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా చూసిన వాళ్లు బాగుందని చెబుతున్నారు. ఇంకా చూడని వాళ్లుంటే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడండి. ఒక మంచి మూవీ చేశాం. మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాం. థియేటర్స్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు వారి రెస్పాన్స్ చూసి హ్యాపీగా అనిపిస్తోంది. మా మూవీకి ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ - మా సినిమాను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. థియేటర్స్ కు వెళ్తున్నారు. ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మూవీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ చిత్రంలో నాకు హీరోగా అవకాశం ఇచ్చి ఇంత మంచి క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన మా డైరెక్టర్ జ్ఞాన ప్రభ గారికి, ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమాను చూడని వాళ్లు తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొని సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని వెల్లడించారు.
నటీనటులు - సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి
లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఏలేందర్
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
నిర్మాత: మేరుం భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట