గరివిడి లక్ష్మి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ 

గరివిడి లక్ష్మి ఇది గౌరవం తీసుకొచ్చే సినిమా : హీరో తేజ సజ్జా

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.  టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో తేజ సజ్జా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గంట శ్రీనివాసరావు గారికి, రఘురాం కృష్ణంరాజు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ బ్యానర్ లాంటిది. ‘గరివిడి లక్ష్మి’ లాంటి అద్భుతమైన కథను నిర్మించిన కృతికి అభినందనలు. ఇందులో ఎంత గొప్ప విషయాన్ని చెప్పారనేది మీరు థియేటర్‌కు వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా నేను చూశాను. ఇది చాలా గౌరవం తీసుకొచ్చే సినిమా. తప్పకుండా అందరూ ఈ సినిమా చూడండి. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మాత్రమే కాదు, ప్రేక్షకులకు, గరివిడి లక్ష్మి గారి అభిమానులకు కూడా గౌరవం తీసుకొచ్చే సినిమా. గౌరీ గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు. సినిమా చూసిన అందరూ కూడా కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. సినిమా అంతా ఒక మంచి మ్యూజికల్‌లా ఉంటుంది. థియేటర్‌లో ఒక కాన్సర్ట్ చూస్తున్నట్టుగా ఉంటుంది. అక్టోబర్ 17న తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. మీరందరూ ప్రోత్సహిస్తే విశ్వ ప్రసాద్ గారు ఇలాంటి మరిన్ని మంచి సినిమాలను ముందుకు తీసుకొస్తారు. గరివిడి లక్ష్మి పాత్రకు తనే తప్ప మరెవరూ సరిపోరన్నంత అద్భుతంగా నటించిన ఆనందికి అభినందనలు. ఈ సినిమాతో తను ఎప్పటికీ గుర్తుండిపోతారు. సినిమా అంతా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా పెర్ఫార్మ్ చేశారు. దసరాకి వస్తున్న అన్ని  తెలుగు సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను.

ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర కళాకారులకు గుర్తింపు తెచ్చే వేదిక ఈ సినిమా. అలాంటి సినిమాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకకు వచ్చాను. ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే నా బాల్యం గుర్తుకొచ్చింది. గరివిడి లక్ష్మి గారి ప్రభావం ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి మనిషి జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను నిర్మించిన విశ్వ ప్రసాద్ గారికి, కృతి గారికి అభినందనలు. చాలా మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేశారు. ఇది ఉత్తరాంధ్ర కళకు రెక్కలు ఇచ్చే సినిమా. కళాకారులకు మళ్లీ ఊపిరి పోసే సినిమా. ‘తండేల్’, ‘పెద్ది’ ఇలా చాలా సినిమాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి వస్తున్నాయి. జెన్యూన్‌గా ఉండే కథలు కావాలంటే ఉత్తరాంధ్ర నుంచే మొదలవుతున్నాయి. ఇండస్ట్రీ దృష్టి కూడా మన మీద ఉంది. మన మీద మనకు నమ్మకం పెరగడానికి ఇంతకంటే ఏం కావాలి? ఇంత మంచి సినిమా నిర్మించిన కృతి ప్రసాద్‌కు అభినందనలు. ఇది అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీ. కమర్షియల్ సక్సెస్ కూడా కావాలని కోరుకుంటున్నాను. గరివిడి లక్ష్మి గారి బుర్రకథలకు ఎలా అయితే హౌస్‌ఫుల్ అయ్యేదో, ఈ సినిమాకు కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను.

రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘గరివిడి లక్ష్మి’ టీజర్, ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. తెలుగమ్మాయి ఆనంది ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది. అత్యద్భుతమైన కళారూపం బుర్రకథ. అలాంటి కళను మళ్లీ పునఃప్రతిష్ఠ చేయాలనే ఆలోచన రావడం నిర్మాత విశ్వ ప్రసాద్ గారి అభిరుచికి నిదర్శనం. నిజంగా అందరూ ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయలేరు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకే గర్వకారణంగా గరివిడి లక్ష్మి బయోపిక్ తీయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వ ప్రసాద్ గారికి అభినందనలు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వ ప్రసాద్ గారు సినిమాల మీద ప్యాషన్‌తో ఈ పరిశ్రమలోకి వచ్చారు. వచ్చిన తక్కువ సమయంలోనే 50 సినిమాలు పూర్తి చేయగలిగారు. ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. వైజాగ్ కూడా షూటింగ్స్‌కు అనువైన ప్రాంతం. ఇక్కడ కూడా మరిన్ని సినిమాల షూటింగ్స్ నిర్వహించాలని కోరుకుంటున్నాను.


నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..ఉత్తరాంధ్రకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ  బయోపిక్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. విజయశాంతి గారికి ‘కర్తవ్యం’, సౌందర్య గారికి ‘అమ్మోరు’, అనుష్క గారికి ‘అరుంధతి’, కీర్తి సురేష్ గారికి ‘మహానటి’ ఎలాగో ఆనందికి ‘గరివిడి లక్ష్మి’ అలాంటి మంచి సినిమాగా నిలుస్తుంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ గౌరీకి థాంక్యూ.  ఈ వేడుకాకు ఎంతో సపోర్ట్ చేసిన వైజాగ్ పోలీస్ కమిషనర్ గారికి, పోలీసులందరికీ ధన్యవాదాలు.

హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. వైజాగ్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది.ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తమ సొంతం చేసుకున్నారు. ప్రతి ఆడియన్‌కు థాంక్యూ సో మచ్. నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఎంతగానో ఆదరణ ఇచ్చారు. గరివిడి లక్ష్మి పాత్రలో నేను నటించినందుకు, దానికోసం మీరందరూ సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా కథ విన్న తర్వాత గరివిడి లక్ష్మి గారి పాత్రలో నటించాలని అనిపించింది. ఎంతోమంది క్రెడిట్ తీసుకోకుండా కళాకారులుగా ఉండిపోయారు. వాళ్లందరికీ రిలేట్ అయ్యే మూవీ ఇది. వాళ్లందరికీ ఒక గుర్తింపు తీసుకురావడానికి చేసిన సినిమా ఇది. అక్టోబర్ 17న తప్పకుండా మీరందరూ మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ మనసులో నిలిచిపోతుంది.

డైరెక్టర్ మోహన్ రాజా మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి, గరివిడి లక్ష్మి గారి గురించి విన్న ప్రతి విషయం నన్ను కదిలిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఆడియన్‌కు కూడా ఇదే రియాక్షన్ ఉంటుందని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప మనసున్నవారు. నేను మొదట దర్శకత్వం వహించిన ‘హనుమాన్ జంక్షన్’, ఆ తర్వాత రామ్ చరణ్ గారితో చేసిన ‘ధ్రువ’, చిరంజీవి గారితో చేసిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలను ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌లోనే ఈ సినిమా సక్సెస్ ఏంటో అర్థమవుతోంది. అద్భుతంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరి ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను.

రాగ్ మయూర్  మాట్లాడుతూ.. బుర్రకథ చాలా గొప్ప కళారూపం. ఈ సినిమా చేయడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. డైరెక్టర్ గారు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు. మా నిర్మాతలు విశ్వ ప్రసాద్ గారికి, కృతి గారికి ధన్యవాదాలు. కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా కళ్లతో చూస్తారు, మనసుతో అనుభూతి చెందుతారు. అలాంటి గొప్ప సినిమా ‘గరివిడి లక్ష్మి’.  తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము మాట్లాడుతూ.. ఈవెంట్‌ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్యూ. ఒక జానపద కళాకారిణి గురించి సినిమా తీస్తే, ఆ సినిమాకు వస్తున్న అభినందనలు మామూలుగా లేవు. సినిమా చూసిన అందరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆ సక్సెస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. తేజగారికి సినిమా చాలా నచ్చింది. సినిమా చూసి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వస్తానని చెప్పారు. చెప్పినట్టే వచ్చి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. విశ్వ ప్రసాద్ గారు ప్రతి ఈవెంట్‌ను ఒక సంబరంలా చేస్తున్నారు. ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేసి మా సినిమాకు గౌరవాన్ని పెంచారు. ప్రసాద్ గారి వల్లే ఇది సాధ్యపడింది. కృతి ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి కృతి ప్రసాద్ గారు ఒక కోటీశ్వరురాలి కుమార్తె. కానీ అందరితో కలిసిపోయి, మేము ఎక్కడ భోజనం చేస్తే అక్కడే తను కూడా భోజనం చేస్తారు. మాతోపాటు ఎండలో పొలాల్లో తిరుగుతారు. అడుగడుగునా ఎంతో సపోర్ట్ చేశారు. ‘గరివిడి లక్ష్మి’ టీమ్ అందరం కృతి గారికి రుణపడి ఉంటాం. ‘గరివిడి లక్ష్మి’ సినిమా ఇంత బాగా రూపుదిద్దుకుందంటే దానికి కారణం కృతి గారే. ఆనంది గారు గరివిడి లక్ష్మి పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమా ఆద్యంతం అలరించేలా వచ్చింది. ఆనంది గారిని మరో సావిత్రి గారు అంటున్నారు. ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా తర్వాత మీరందరూ తనను గరివిడి లక్ష్మి అని పిలుస్తారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఈ కథ చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది.  ‘ఇవి కదా అసలైన పాటలు’ అనిపించింది. ఉత్తరాంధ్రకు నేను చాలా రుణపడి ఉంటాను. చాలా రోజులుగా నాలో ఉన్న ఆకలిని ‘గరివిడి లక్ష్మి’ సినిమా తీర్చింది. నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌ను పూర్తిస్థాయిలో ఇండస్ట్రీకి చూపించడానికి ఈ సినిమా ఉపయోగపడింది. మీరందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని, ఇక్కడి నుంచే బ్లాక్‌బస్టర్ సౌండ్ వినిపిస్తుందని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో చిత్రబృందం సభ్యులందరూ పాల్గొన్నారు