హ్యాపీ జర్నీ మూవీ మేకర్స్ సక్సెస్ మీట్
హ్యాపీ జర్నీ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నటి ఝాన్సీ
అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ హిట్ ‘హ్యాపీ జర్నీ’. జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించారు. అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో ఝాన్సీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే వెళ్లి చూడండి. చాలా మంచి సినిమా చేశాం. మీరందరూ తప్పకుండా చూడాలి. ఎడిటర్ గారు ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి తప్పకుండా హిట్ కొడుతుందని చెప్పారు. అదే నిజమైంది. సినిమాకి ఆవుపట్టు వంశీ నటన. ఇందులో నవ్వులు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. వంశీ అన్నీ చేశాడు. మా పాత్రలన్నీ ఇతనే నడిపించాడు. వంశీ చాలా మంచి టైమింగ్ ఆర్టిస్ట్. తను మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అభిరామ్ మా లక్కీ చార్మ్. అద్భుతమైన కథను తీసుకొచ్చాడు. అంతే అద్భుతంగా తీశాడు. అందరం కూడా ఇది మా సినిమా అని ఫీల్ అయ్యాము. పాయల్, సునైనా అందరూ కూడా చాలా అద్భుతంగా తమ పాత్రలు చేశారు. ఇందులో ప్రతి ఒక్కరికీ మెమొరబుల్ మూమెంట్ దొరికింది. ఇందులో ప్రీ-క్లైమాక్స్ నా మూమెంట్. మేము చాలా మంచి సినిమా చూశాము. ఈ సినిమా విషయంలో గర్వపడుతున్నాము. ఏడుగురు మహిళలు కలిసి చేసిన సినిమాగా ఇది ఒక పాత్‌బ్రేక్ మూవీ అవుతుంది. ఇలాంటి మరిన్ని సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాను.
పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని నా పేరెంట్స్‌తో కలిసి చూడడం చాలా ఆనందాన్నిచ్చింది. చూసిన ఆడియన్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు.
ఇది చాలా అద్భుతమైన సినిమా. మీరందరూ వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మా అమ్మానాన్నలకు సినిమా చాలా నచ్చింది. అది నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది.
డైరెక్టర్ అభిరామ్ మాట్లాడుతూ..సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను అమ్మాయిల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అబ్బాయిల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ‘మా ఫ్యామిలీతో కలిసి వెళ్లాము’ అని చెప్తున్నారు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఝాన్సీ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో అందరికీ చాలా బాగా కనెక్ట్ అయింది. అన్నపూర్ణమ్మ గారు, ఆమని గారు, ఝాన్సీ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాతో నాకు చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. తప్పకుండా మీరందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లండి. చాలా ఎంజాయ్ చేస్తారు.”
వంశీ మాట్లాడుతూ.. ఆడియన్స్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమా చూసిన వాళ్లందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రెండు గంటల సినిమా. ఒక్క మూమెంట్ కూడా బోరింగ్ ఉండదు.
కామెడీ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతున్నారు. మా టీమ్ అందరికీ థాంక్యూ. ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన సినిమా. తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూస్తారని కోరుకుంటున్నా.
సునైనా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్ చేయాలని ఎదురుచూస్తున్న సమయంలో ‘హ్యాపీ జర్నీ’ వచ్చింది. సినిమాని ఓవర్సీస్‌లో షూట్ చేశాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.