కాగితం పడవలు చిత్రం జూలై 24 రిలీజ్

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్స్ గా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ కాగితం పడవలు'. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.  జూలై 24న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన పంపిణీ సంస్థల్లో ఒకటైన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం.

ఒక సినిమా కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తాయి. దీంతో 'కాగితం పడవలు' పై పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రానికి AIS.నౌఫల్ రాజామ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి డీవోపీగా పని చేస్తున్నారు, జెస్విన్ ప్రభు ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.హిమ బిందు.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: వర్ధన్, కృష్ణప్రియ

రచన & దర్శకత్వం: ఎంజీఆర్ తుకారాం
నిర్మాతలు: కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప
సంగీతం : AIS.నౌఫల్ రాజా
డీవోపీ: రుద్రసాయి
ఎడిటర్: జెస్విన్ ప్రభు
కాస్ట్యూమ్స్: కిరణ్
పీఆర్వో: తేజస్వి సజ్జా