న్యూటన్స్ థర్డ్ లా మూవీ జూలై 31 విడుదల

'న్యూటన్స్ థర్డ్ లా' చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్ మూవీ : హీరో సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'న్యూటన్స్ థర్డ్ లా' కథను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. 'అనగనగా' తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్ర చాలా బలంగా ఉండాలని చెప్పాను. ఆ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటేనే సినిమా ఆడుతుందని అప్పుడే అనుకున్నాను. నిజంగానే ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఈ పాట కూడా వాళ్ల పాత్రలపైనే ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అనగనగాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగాఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలా మంచి సినిమాతో వస్తున్నాం. సినిమా విషయంలో మేమంతా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ... న్యూటన్స్ థర్డ్ లా జూలై 31న విడుదల కానుంది. మా విజయవంతమైన చిత్రం 'లిటిల్ హార్ట్స్'కు సంగీతం అందించిన సింజిత్ ఈ సినిమాకూ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుమంత్ గారి లాంటి నటుడు తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం మా అదృష్టం. 'అనగనగా' సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ సినిమా విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు ముంబైలో సుమంత్ గారు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా సక్సెస్ జర్నీ కూడా 'అనగనగా'తో ప్రారంభమైంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'న్యూటన్స్ థర్డ్ లా' కూడా ఆ విజయాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నాం. ఈ సినిమా విషయంలో మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. జూలై 31న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం.

దర్శకుడు రాజేష్ కర్ణ మాట్లాడుతూ... ఈటీవీ విన్ ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి సహకారం అందించింది. వారి గట్స్, సినిమాపై ఉన్న ప్యాషన్ అభినందనీయం. థ్రిల్లర్ జానర్ గురించి మాట్లాడినప్పుడల్లా 'న్యూటన్స్ థర్డ్ లా' పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేస్తుంది. సుమంత్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సింజిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు."

నటుడు త్రినాద్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమంత్ గారికి, దర్శకుడు రాజేష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. సింజిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది."

సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి మాట్లాడుతూ...కృష్ణ చైతన్య గారు అద్భుతమైన సాహిత్యం రాశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా అమ్మగారు సుమంత్ గారికి చాలా పెద్ద అభిమానిని. ఆయన సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది."

నిర్మాత కె. హరీష్ మాట్లాడుతూ.. మేము చాలా మంచి సినిమా తీశాం. ఈ కథ నా దగ్గరకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథను నాతో పాటు నమ్మిన బాపినీడు గారికి, సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు. సుమంత్ గారు, జగపతిబాబు గారు, అవసరాల శ్రీనివాస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలు చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ..."ఈ కథ నాకు తెలుసు. ఇది చాలా మంచి కథ. సింజిత్ సంగీతం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. న్యూటన్ చెప్పిన 'ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది' అనే సిద్ధాంతం ఈ సినిమాలో ఎలా ఉంటుందో థియేటర్‌లో చూస్తారు. సుమంత్ గారితో మరోసారి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.

డీవోపీ వేదవ్యాస్ మాట్లాడుతూ... మా దర్శకుడు, నిర్మాతలకు, హీరో సుమంత్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమాను చూడాలని కోరుకుంటున్నాను."
 

నటీనటులు: సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, త్రినాధ్ వర్మ, నేహా పఠాన్, షెల్లీ ఎన్ కుమార్, గౌతమ్ పండిట్, హరిణి రావు, రూపేష్ మర్రాపు, అభినయ

సిబ్బంది:
దర్శకత్వం - రాజేష్ కర్ణ
నిర్మాత - హరీష్ కోహిర్కర్
DOP - వేద వ్యాస్ గొట్టిపాటి
సంగీతం- సింజిత్ యర్రమిల్లి
ఎడిటర్ - అనిల్ పసల
పీఆర్వో: వంశీ శేఖర్