రోమియో జూలియట్  మూవీ పోస్టర్  విడుదల 

‘రోమియో జూలియట్’ మూవీ  రొమాంటిక్ యాక్షన్ పోస్టర్

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు.

దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘రోమియో జూలియట్’ నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ రొమాన్స్, యాక్షన్ అంశాల కలయికతో ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌లో హర్షిత్ సన్‌గ్లాసెస్ ధరించి, చేతిలో గన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విశాఖ ధిమాన్ ఎరుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నారు. చుట్టూ ముళ్ల తీగలు, ఎర్ర గులాబీలు, గాలిలో ఎగురుతున్న పూలరేకులు కనిపిస్తున్నాయి. బుల్లెట్లు పోస్టర్‌కు యాక్షన్ ఫీల్‌ను తీసుకొస్తే, గులాబీలు, ఎరుపు రంగు రొమాంటిక్ కోణాన్ని హైలైట్ చేస్తున్నాయి.

 ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసిన ఈ సినిమా ‘స్టోరీ రివీల్’ గ్లింప్స్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.  ట్యుయేషన్‌షిప్స్, క్యాజువల్ రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్, యువ జంటల మధ్య మారుతున్న సంబంధాలను ‘రోమియో జూలియట్’ ప్రజెంట్ చేయనుంది. నేటి యువత తమ ప్రేమ సంబంధాల్లో ఎదుర్కొంటున్న అనుభవాలు, ఆలోచనలకు అద్దం పట్టే కథతో జెన్‌-జెడ్ ప్రేక్షకులని అలరించేలా వుంటుంది.

ఈ సినిమాలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాగతి కథను అందించగా, గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, యువ కిరణ్ ఎడిటింగ్ . కార్తా ప్రొడక్షన్స్ ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి ప్రొడక్షన్ డిజైనర్స్.

నటీనటులు: హర్షిత్, విశాఖ ధిమాన్, వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్

సాంకేతిక బృందం
దర్శకత్వం: భార్గవ్ మాచర్ల
రచన: భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాగతి
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్
ఎడిటర్: యువ కిరణ్
నిర్మాతలు: సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
బ్యానర్: నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: వంశీ–శేఖర్