రూపాయనమ: మూవీ ఫస్ట్ లుక్  విడుదల 

రూపాయనమ:’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరుణ్ భాస్కర్

చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రూపాయనమ:’. ఈ సినిమాలో  అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి ప్రధాన పాత్రలను పోషించారు. కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఫ్యామిలీ, కామెడీ అంశాలతో పాటుగా థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాల్ని కూడా జోడించారు. ఈ మూవీని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. రెండు గంటల 13 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది.

‘రూపాయనమ:’ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ, సస్పెన్స్, హ్యూమర్ ఇలా అన్ని అంశాలను జోడించిన ఈ సినిమాని అందంగా మలిచారని సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

ఈ చిత్రం మొదటి పోస్టర్ మరియు టైటిల్ సాంగ్ ను దర్శకులు తరుణ్ భాస్కర్ విడుదల చేసారు. సోషల్ మీడియా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మున్ముందు ప్రమోషనల్ కంటెంట్‌ను వదిలి చిత్రంపై అంచనాల్ని పెంచనున్నారు.

ఈ సినిమాకి రిషి.ఎం మ్యూజిక్ డైరెక్టర్‌గా, జింక వరుణ్ నాయుడు కెమెరామెన్‌‌గా పని చేశారు. ఈ మూవీకి ఎడిటర్‌గా రవితేజ గిరిజాల వర్క్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు :  అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి, తదితరులు

బ్యానర్ : చిత్రవేద ప్రొడక్షన్స్
నిర్మాత  :పావని సాగి
రచయిత, దర్శకుడు : అరవింద్ రెడ్డి
కెమెరామెన్ : జింక వరుణ్ నాయుడు
ఎడిటర్ : రవితేజ గిరిజాల
మ్యూజిక్ డైరెక్టర్ : రిషి.ఎం