సీక్రెట్ సోల్జర్ మూవీ దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి విలేకరుల సమావేశం

సీక్రెట్ సోల్జర్ మూవీ రియలిస్టిక్ స్పై డ్రామా : డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి  

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

చైనా పీస్..  ‘సీక్రెట్ సోల్జర్’ గా ఎలా మారింది?  
-సినిమాలో ఒక క్యారెక్టర్‌ని ఉద్దేశించి ఆ టైటిల్ పెట్టాను. కాకపోతే అది కాస్త పొలిటికల్ అయింది. చైనా-గల్వాన్ యుద్ధం రావడంతో మరింత పొలిటికల్ అయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడానికి లేదు. అప్పుడు కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. నేను చైనాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేశాను. అది కూడా సెన్సార్ రివ్యూ‌కి ఒక కారణమైంది. అలా టైటిల్ మార్చడం జరిగింది. 

సెన్సార్ విషయంలో ఎలాంటి అనుభవం ఎదురైంది?
-సినిమా సబ్జెక్ట్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. అది కూడా సెన్సార్ వల్లే మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా డీటెయిల్‌గా ఈ సినిమాని సెన్సార్ చేశారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా అన్నిచోట్ల రివ్యూ జరిగింది. ఫైనల్‌గా సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు.

-ఈ ప్రయాణంలో మానసికంగా చాలా ఒత్తిడి ఉండేది. ఈ సినిమాలో చూపించిన చాలా ఎలిమెంట్స్ చాలా బిలీవబుల్‌గా ఉన్నాయని, అవన్నీ ఎక్స్‌పర్ట్స్‌కి చూపించాలని వాళ్లు చెప్పారు. అంతా క్లియర్ అయిన తర్వాత సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు.

‘సీక్రెట్ సోల్జర్’ కథ ఎక్కడ మొదలవుతుంది?
-ఈ కథ నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. నేను నెల్లూరులో చదివాను. అక్కడ రిలేటబుల్‌గా ఉండే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశాను. ఇప్పటివరకు నేను చూసిన ఆడియన్స్ చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని చెప్పారు.

కథలో ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయి?
ఈ కథకి వెన్నెముక ఫ్రెండ్‌షిప్. దాని చుట్టూ ఇంటెన్సిటీ, థ్రిల్లింగ్, కామెడీ.. ఇవన్నీ చాలా సహజంగా ఉంటాయి.
ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు దేశభక్తి ఉన్నవాడు. ఇంకొకడు తను హ్యాపీగా ఉన్నాడా లేదా అనేది చూసుకునే క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్‌గా కథ ఉంటుంది.

ఈ కథ రాయడానికి స్ఫూర్తి ఏంటి?
-ఈ కథ రాయడానికి పర్సనల్‌గా నేను చూసిన ఒక ఇన్సిడెంట్ కారణం. ఈ సినిమాని కొంతమంది ప్రొడ్యూసర్లకు చెప్పాను. అందరూ సబ్జెక్ట్‌ని లైక్ చేశారు. కాకపోతే ఇది పెద్ద స్టార్ ఫిల్మ్ స్టార్స్‌తో చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పారు.
కాకపోతే ఈ సినిమా పెద్ద స్టార్స్‌తో చేస్తే దీని ఉద్దేశం పక్కదారి పడుతుందని అనిపించింది. ఇది ఒక బ్యాలెన్స్‌గా చెప్పే కథ. సో.. మనల్ని మనమే నమ్ముకోవాలని నేనే ప్రొడ్యూస్ చేశాను.

-స్పై అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది చాలా ఆర్గానిక్‌గా జరిగింది.
గూఢచారి అందరిలోనూ కలిసిపోయి ఉండాలి. అలాంటి గ్రౌండ్ అప్రోచ్ ఉన్న కథ ఇది.

సినిమా చూసినవాళ్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
-కొంతమందికి ఈ సినిమా చూపించాము. చూసిన వాళ్లందరూ కూడా ‘దురంధర్’ లాంటి సినిమా.. కాకపోతే ఇది కొత్త వాళ్లతో చేశారని చెప్పారు. మొదట్లో చాలామంది ఈ సినిమా చూసి అసలు ఇది సెన్సార్ క్లియర్ అవుతుందా అని సందేహం వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పినట్టే ఇది సెన్సార్‌లో చాలా డిలే అయింది. ఆ కంటెంట్ ఏంటి అనేది మీరు థియేటర్‌లో చూస్తారు. అయితే సెన్సార్ డిలే జరిగినా వాళ్లు ఈ సినిమాకి సంబంధించి ఏ కంటెంట్‌ని టచ్ చేయలేదు.

డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాతో ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
-నేను నిర్మాత కావడం వల్ల నాలో ఉన్న డైరెక్టర్‌ని కాంప్రమైజ్ చేయలేదు.  ఇప్పుడు ఆడియన్స్ అందరూ చాలా క్లియర్‌గా, క్లారిటీతో ఉన్నారు. కాకపోతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో కొత్త సినిమాలని, కొత్త ప్రయత్నతాలని జడ్జ్ చేయలేకపోతున్నారనిపోస్తోంది.

-కొత్త హీరోలతో అయితే ప్రేక్షకులు రారు అనే ఒక నమ్మకం ఉంది. అందులో వాళ్ళ తప్పూ తప్పులేదు. ఎందుకంటే అది ఎప్పుడూ జరుగుతుంది. కాకపోతే కొత్త ప్రయత్నాలని రికగ్నైజ్ చేయాలి. కొత్తగా వచ్చే సినిమాల విషయంలో జడ్జిమెంట్ పెరగాలి. ఒక మంచి సినిమా అన్ని దాటుకుని వస్తుందని నేను బలంగా నమ్మాను.

ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు?
నెల్లూరు, హైదరాబాద్, గల్వాన్, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. దాదాపు 45 రోజులు షూటింగ్ జరిగింది.

మీ టీమ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది?
-మా టీమ్ చాలా కోఆపరేట్ చేసింది. మా టీమ్ విషయంలో చాలా గర్వంగా ఉన్నాను. కేవలం నటించడమే కాదు, ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరూ కూడా వాళ్ల సొంత సినిమా లాగా చేశారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
-నెక్స్ట్ ఒక రొమాంటిక్ కామెడీ చేస్తున్నాను. ఆ సినిమాకి కూడా నేనే దర్శకత్వం, నిర్మాతగా చేయాలని అనుకుంటున్నాను.