Sing Geetham Movie Review
Emotional Engagement Emoji
సినిమా విషయానికి వస్తే, పాత్రల పరిచయం మరియు కథలోకి తీసుకెళ్లే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక గ్రామాన్ని చుట్టుముట్టిన శాపం, దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు అనేదే కథకు కేంద్రబిందువు. మొదటి అరగంట బాగానే సాగినా, ఆ తర్వాత కొంతమంది ప్రేక్షకులకు నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. కానీ రెండో భాగం మొదలైన తర్వాత సినిమా మళ్లీ తన లయను అందుకుంటుంది. క్లైమాక్స్‌కి చేరుకునే కొద్దీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మనిషి అవసరాలను దాటి అత్యాశ వైపు పరుగెత్తితే దాని పరిణామం ఎలా ఉంటుందో Singeetham గారు తనదైన స్థాయిలో ఎంతో అందంగా చెప్పారు.
ఈ సినిమా చూస్తుంటే మళ్లీ ఒకసారి “Singeetham గారు Singeetham గారే” అనిపించింది. చివరగా ఒక్క మాట చెప్పాలంటే, కొన్ని సినిమాలను కేవలం మంచి, చెడు అనే కొలమానాలతో అంచనా వేయలేం; వాటిని అనుభవించాలి. Sing Geetham కూడా అలాంటి అనుభవమే. దీనికి ‘గుడ్’ లేదా ‘బ్యాడ్’ అనే తీర్పు ఇచ్చి నేను గొప్పవాడినని అనిపించుకోలేను. నేను చెప్పగలిగింది ఒక్కటే — నేను Singeetham గారి సినిమాను చూసాను కాదు, అనుభవించాను.
🎭 తారాగణం (Cast)
ఈ చిత్రంలోని పాత్రలకు ప్రాణం పోసి, సంభాషణలను సైతం పాటల రూపంలో పలికించిన నటీనటుల వరుస క్రమం:
ప్రతాప్: అయాన్ కే (నూతన పరిచయం — కథానాయకుడు)
గౌరి: అహల్య బమ్రూ (నూతన పరిచయం — కథానాయిక)
వ్యాపారవేత్త: శాలిని కొండిపూడి (విలక్షణ పాత్రలో)
ముఖ్య పాత్రలు:
బేనర్జి మగంటి
శివనారాయణ
తులసి శివమణి
అగు స్టాన్లీ చియెడోజీ
బాల నటీనటులు: చిత్రంలో కీలకమైన గాన-సంభాషణలు పలికిన పలువురు బాలలు.
🎬 సాంకేతిక వర్గం (Crew)
ఈ దృశ్య రూపకానికి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులు మరియు శిల్పుల వివరాలు:
దర్శకత్వ పర్యవేక్షణ (రూపకర్త): సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నాగ్ అశ్విన్
సమర్పణ: సి. అశ్విని దత్ (వైజయంతీ ఫిలింస్)
కార్యనిర్వాహక దర్శకుడు (Executive Director): సంకల్ప్ గోరా
సంగీత దర్శకుడు (స్వర బ్రహ్మ): దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం (Cinematographer): అనుకుర్ సి.
రచనా సహకారం (Co-Writers):
గౌతమి చల్లాగుళ్ల
నందకిషోర్ ఈమని
శశాంక్ చింతలపూడి
రత్న శ్రీకర్
రాహుల్ వి. రాజేశ్వర్