తక్దీర్ మూవీ ప్రారంభం
ఘనంగా ‘తక్దీర్’ మూవీ షూటింగ్ ప్రారంభం
ఎస్‌వీఎన్ రావు సమర్పణలో, ఫ్లిమీ క్రియేషన్స్, ఆరెంజ్ మీడియా ఆర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘తక్దీర్’ చిత్రానికి సంబంధించిన సాంగ్ షూటింగ్ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో Dr చల్లగాలి వెంకటరాజు గారు ఫస్ట్ క్లాప్ కొట్టడం జరిగింది. మొదటగా సింగర్స్ శారదా సాయి, రామ్ దుర్వాసులతో పాడించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించారు.
ఈ చిత్రానికి దీక్షిత్ జూకంటి దర్శకత్వం వహిస్తుండగా, కె. పరంధాములు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని కె. లక్ష్మణ్ సాయి అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని భాస్కర్ నిర్వహిస్తున్నారు. చంద్ర ఆదిత్య సాహిత్యం అందిస్తున్నారు.
సౌండ్ ఇంజనీర్ కేకే, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎం. మురళి రెడ్డి, ఫోటోగ్రఫీ బాధ్యతలను స్వామి, కోఆర్డినేషన్ బాధ్యతలను ఎన్. సహదేవ్ ముదిరాజ్ నిర్వహిస్తున్నారు.
‘తక్దీర్’ చిత్రంలోని సాంగ్ షూటింగ్ ప్రారంభం కావడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. కుటుంబం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.